ETV Bharat / state

ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల గ్రేడింగ్‌కు కసరత్తు - ఆరోగ్య శ్రీ తాజా వార్తలు

ఆరోగ్య శ్రీ సేవలను సమర్థంగా అందించేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో ఆసుపత్రుల తీరుపై ప్రభుత్వం మరింత నిఘా పెంచనుంది. చెల్లించే ప్రతిపైసాకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు రోగులు త్వరగా కోలుకోవడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Arogyasree Hospital Grading
ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల గ్రేడింగ్‌కు కసరత్తు
author img

By

Published : Oct 5, 2020, 1:40 PM IST

ఆరోగ్యశ్రీ దవాఖానాలకు గ్రేడ్లు, నక్షత్రస్థాయి కేటాయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. పడకలు, నాణ్యత ఆధారంగా ‘ఏ’ గ్రేడు, సేవలకు ఇచ్చే నక్షత్రాల స్థాయిలో వడుకు మించే అవకాశం కనిపించడం లేదు. పడకలు తీసుకున్నా చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి.●

వాటి పనితీరు, నాణ్యత, సౌకర్యాల ప్రాతిపదికన ఏ, బీ, సీలుగా విభజించనున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 21, కామారెడ్డిలో రెండు చోట్ల సేవలందుతున్నాయి. వీటిలో వడు ప్రభుత్వ పరిధిలో ఉండగా మిగిలినవి ప్రైవేటు దవాఖానాలు.

ఉభయ జిల్లాల్లో 23 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలకు అనుమతుంది. వీటిలో ఆరు ఆసుత్రులు మొక్కుబడిగా సేవలను కొనసాగిస్తున్నాయి. మిగిలినవి కొన్ని శస్త్రచికిత్సలకే పరిమితం చేశారు. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.10 కోట్ల మేర పేరుకుపోయాయి. చెల్లింపులో ఆలస్యం కావడంతో కొన్ని ఆసుపత్రులు మొక్కుబడిగా సేవలందిస్తున్నాయి.

రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా నిర్లక్ష్యమే..

ఆరోగ్యశ్రీకి కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రైవేటు దవాఖానాల్లో నాణ్యత అంతంతమాత్రమే. బకాయిలు ఆలస్యంగా ఇస్తున్నారని రోగులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో అన్ని సేవలు ఉండే వాటికే ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇలాంటివి నాలుగుకు మించి లేవు. 200 పడకలకు మించి ఉన్న వాటికి ఏ గ్రేడ్‌ వచ్చే అవకాశం ఉండగా.. ఉభయ జిల్లాల్లో ఒక్కటీ లేదు. గ్రేడ్‌ల పేరుతో వాటిని వెనక్కి నెట్టకుండా ఛార్జీలు పెంచి ప్రమాణాలు పెరిగేలా జిల్లాస్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

స్పష్టమైన ఆదేశాలు రాలేదు

గ్రేడ్‌ల విభజన, నక్షత్రస్థాయి కేటాయింపు విషయంలో జిల్లాకు ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు. జిల్లాలో అన్నిరకాల సేవలున్న ఆసుపత్రులు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. పూర్తిస్థాయి ఆదేశాలు వస్తేనే స్పష్టత వస్తుంది. -డాక్టర్‌ వినీత్‌, ఆరోగ్యశ్రీ ఇన్‌ఛార్జి

ఇవీ చూడండి: పేదరికంలో కూరుకుపోయిన 135 కోట్ల మంది బాలలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.