నిజామాబాద్‌కు పసుపుబోర్డుపై కేంద్రానివి, ఎంపీ ధర్మపురి అర్వింద్‌వి నకిలీ మాటలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం ఇచ్చింది పసుపుబోర్డు కాదని... సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం మాత్రమేనని జీవన్ రెడ్డి తెలిపారు. ఇలాంటి రీజినల్ ఆఫీసులు ఇప్పటికే 6 ఉన్నాయని పేర్కొన్నారు.
కేంద్రం పాచిపోయిన అన్నాన్ని నిజామాబాద్ రైతులకు వడ్డిస్తోందని విమర్శించారు. రైతులకు వాస్తవాలు త్వరలోనే అర్థమవుతాయన్నారు. పసుపుబోర్డు కోసం మాజీ ఎంపీ కవిత ఎక్కని గడపలేదని జీవన్ రెడ్డి తెలిపారు. స్పైసెస్ బోర్టు పేరిట ఎంపీ అర్వింద్ మాయ చేస్తున్నారని ఆరోపించారు. ఆయనకు ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఇదీ చూడండి: నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం