నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద గల ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలో ఏసీ పేలింది. ఒక్కసారిగా పోగలు అలుముకున్నాయి. ఆ సమయంలో ఎవరు కూడా ఏటీఎం సెంటర్లో లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఎస్బీఐ అధికారులు ప్రమాదం స్థలాన్ని పరిశీలించారు.
కలెక్టరేట్ ప్రాగణంలోని చెట్ల కొమ్మలు నరికే సమయంలో ఆ ఏటీఎంకి సంబంధించిన తీగపై కొమ్మలు పడడం వల్ల ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలో ఇలాంటి ఘటన జరగడంపై ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఇదీ చూడండి : కల్యాణలక్ష్మికి.. అందని 'లక్ష్మీ' కటాక్షం..?