నిజామాబాద్ జిల్లా బాల్కొండలో గ్రామ దేవతలను పవిత్ర గోదావరి నదీ జలాలతో జలాభిషేకం నిర్వహించారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో దేవతల అమావాస్య కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని.. పంటలు బాగా పండాలని కోరుతూ ఈ ఉత్సవాన్ని చేశారు.
గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని గోదావరి నది నుంచి బిందెల్లో గంగా జలాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. డప్పు వాయిద్యాలతో గంగా జలాలను ఊరేగించి దేవతలందరినీ అభిషేకించారు.
ఇదీ చూడండి : పురపాలికలను దక్కించుకునేందుకు తెరాస వ్యూహాలు