ETV Bharat / state
పురపాలికలను దక్కించుకునేందుకు తెరాస వ్యూహాలు - మున్సిపల్ ఎన్నికల్లో తెరాస వ్యూహాలు
రెండు మున్సిపాలిటీలు మినహా రాష్ట్రంలోని అన్ని నగర, పుర పీఠాలను కైవసం చేసుకునేందుకు తెరాస వ్యూహాలను సిద్ధం చేసింది. తొమ్మిది కార్పొరేషన్లలో తమ జెండానే ఎగురుతుందని గులాబీ పార్టీ ధీమాతో ఉంది. ఎంఐఎం ఆధిక్యత సాధించిన భైంసా, జల్పల్లి మినహా మిగతా పురపాలక సంఘాలన్నీ కైవసం చేసుకునేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంది. మేయర్, ఛైర్పర్సన్ల జాబితాకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు.
పురపాలికలను దక్కించుకునేందుకు తెరాస వ్యూహాలు
By
Published : Jan 27, 2020, 4:23 AM IST
| Updated : Jan 27, 2020, 7:52 AM IST
పురపాలికలను దక్కించుకునేందుకు తెరాస వ్యూహాలు పురపోరులో అత్యధిక వార్డులను కైవసం చేసుకున్న తెరాస... తొమ్మిది నగర పాలక సంస్థలు... 118 పురపాలక సంఘాలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. స్వతంత్రుల మద్దతుతో పాటు... ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో కైవసం చేసుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లలో తెరాస ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యత సాధించింది.
ఆధిక్యం లేనిచోట స్వతంత్రుల మద్దతుతో..
నిజామాబాద్, రామగుండం, మీర్పేట్, బండ్లగూడ, బోడుప్పల్ మేయర్ స్థానానికి అవసరమైన మెజార్టీ ఏ పార్టీకి లేదు. బోడుప్పల్లో తెరాస రెబల్స్‌గా పోటీ చేసి గెలిచిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో పాటు... మంత్రి మల్లారెడ్డి, ఒకరిద్దరు ఎమ్మెల్సీలు.. ఎక్స్ అఫిషియో ఓటుతో సునాయసంగా మేయర్, డిప్యూటీ మేయర్ దక్కించుకోనుంది. రామగుండంలో తెరాస 18 స్థానాల్లో విజయం సాధించగా.. ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గెలిచిన 16 మంది తెరాస రెబల్స్ మద్దతు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మీర్‌పేటలో మొత్తం 46 స్థానాల్లో తెరాస 19... భాజపా 16 స్థానాల్లో గెలిచింది. అక్కడ గెలిచిన 8 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో కొందరు తెరాసకే మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇందూరును ఇలా పంచుకున్నారు
నిజామాబాద్ కార్పొరేషన్లో తెరాస... ఎంఐఎం మద్దతు తీసుకోనుంది. గులాబీ పార్టీకి మేయర్, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ పదవులు పంచుకునేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు అందరూ కలిపి ఐదు ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. బడంగ్‌పేట కార్పొరేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ 32 స్థానాల్లో తెరాస 13, భాజపా 10, కాంగ్రెస్ 7, స్వతంత్రులు ఇద్దరు గెలిచారు. స్వతంత్రుల మద్దతును తెరాస కూడగట్టుకుంటోంది. సబిత ఇంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఎమ్మెల్సీలు నాయని నర్సింహారెడ్డి, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, ఎగ్గే మల్లేశం ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేశారు.
113 పురపాలికల్లో విజయం సాధించినట్లే
రాష్ట్రంలోని 118 పురపాలక సంఘాల్లోని సుమారు 113 మున్సిపాలిటీల్లో విజయం ఖాయమైనట్లేనని తెరాస శ్రేణులు చెబుతున్నాయి. 90 శాతం స్వతంత్రులు తమకు మద్దతు ప్రకటించారని తెరాస నేతలు చెబుతున్నారు. వీటితో పాటు ఎక్స్ అఫిషియో ఓట్లను వ్యూహాత్మకంగా వినియోగించుకునేలా ప్రణాళికలు చేశారు. దాదాపు 29 పురపాలికల్లో ఎక్స్అఫిషియో సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి. పెద్ద అంబర్‌పేట, తుర్కయాంజాల్, కోస్గి, ఆదిభట్ల, తుక్కుగూడ, కొల్లాపూర్, వడ్డేపల్లి, అయిజ వంటి మున్సిపాలిటీల్లో నాటకీయ రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల అవసరమైతే సభ్యులు గైర్హాజరై... కోరం లేక ఎన్నిక వాయిదా పడేలా చేసే అవకాశం ఉంది. పోటాపోటీ ఉన్న చోట ఎన్నికైన సభ్యులు ఇప్పటికే రహస్య శిబిరాల్లో ఉన్నారు.
అందరికీ సమతూకంగా
రెండు రోజులుగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చించి వ్యూహాలు ఖరారు చేశారు. ఒక్కో పదవికి కనీసం రెండు పేర్లను సూచించారు. ఉద్యమ కాలం నుంచి ఉన్న నేతలు.. రాష్ట్రావిర్భావం తర్వాత చేరిన నాయకుల మధ్య సమతూకం పాటించారు. మరోవైపు అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చేలా కూర్పు చేశారు. కొన్ని జనరల్ స్థానాల్లోనూ బీసీలు, మహిళలకు చోటు కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. నేటి కౌన్సిల్ సమావేశానికి సుమారు గంట ముందుగా అభ్యర్థి పేరును ప్రకటించాలని ఎమ్మెల్యేలకు తెరాస సూచించింది. అవసరమైతే విప్ జారీ చేసే అధికారాలను ఎమ్మెల్యేలకు పార్టీ నాయకత్వం అప్పగించింది.
ఇదీ చూడండి: రాజ్‌భవన్‌లో ఎట్‌హోం... సీఎం సహా ప్రముఖుల హాజరు

TG_HYD_01_27_TRS_STRATEGY_FOR_MUNCIPALITIES_PKG_3064645
reporter: Nageshwara Chary
note: Pls use file vis and grafix
( ) రెండు మున్సిపాల్టీలు మినహా రాష్ట్రంలోని అన్ని నగర, పుర పీఠాలను కైవసం చేసుకునేందుకు తెరాస వ్యూహాలను సిద్దం చేసింది. తొమ్మిది కార్పొరేషన్లలో తమ జెండానే ఎగురుతుందని గులాబీ పార్టీ ధీమాతో ఉంది. ఎంఐఎం ఆధిక్యత సాధించిన భైంసా, జల్ పల్లి మినహా మిగతా పురపాలక సంఘాలన్నీ కైవసం చేసుకునేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంది. స్వతంత్రులు, ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందించింది. నాలుగైదు చోట్ల అవసరమైతే ఇవాళ గైర్హాజరై.. వాయిదా పడేలా చేసే అవకాశం ఉంది. మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ అభ్యర్థుల జాబితాకు తెరాస అధినేత కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. సమావేశానికి గంట ముందు ప్రకటించాలని ఎమ్మెల్యేలకు తెరాస సూచించింది. look
వాయిస్ ఓవర్: అత్యధిక వార్డులను కైవసం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి... తొమ్మిది నగర పాలక సంస్థలు... 118 పురపాలక సంఘాలను దక్కించుకోవాలని భావిస్తోంది. స్వతంత్రులుగా గెలిచిన నాయకుల మద్దతుతో పాటు... ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ఓట్లతో కైవసం చేసుకునేలా ప్రణాళికలు చేసింది. తొమ్మిది నగర పాలక సంస్థలపై గులాబీ జెండా ఎగురుతుందున్న ధీమాతో ఉంది. ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లలో తెరాస ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యత సాధించింది. ఫిర్జాదిగూడ మేయర్ గా జక్కా వెంకట్ రెడ్డి పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నిజామాబాద్, రామగుండం, మీర్ పేట్, బండ్లగూడ, బోడుప్పల్ లో మేయర్ స్థానానికి అవసరమైన మెజార్టీ ఏ పార్టీకి పూర్తిగా లేదు. అయితే బోడుప్పల్ లో తెరాస రెబల్స్ గా పోటీ చేసి గెలిచిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో పాటు... మంత్రి మల్లారెడ్డి, ఒకరిద్దరు ఎమ్మెల్సీలు కూడా ఎక్స్ అఫిషియో ఓటుతో సునాయసంగా మేయర్, డిప్యూటీ మేయర్ దక్కించుకోనుంది. రామగుండంలో తెరాస 18 స్థానాల్లో విజయం సాధించగా.. ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గెలిచిన 16 మంది తెరాస రెబల్స్ మద్దతు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మీర్ పేటలో మొత్తం 46 స్థానాల్లో తెరాస 19... భాజపా 16 స్థానాల్లో గెలిచింది. అక్కడ గెలిచిన 8 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో కొందరు తెరాసకే మద్దతుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారితో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులతో కైవసం చేసుకోవాలని తెరాస భావిస్తోంది.
వాయిస్ ఓవర్: నిజామాబాద్ కార్పొరేషన్ లో ఎంఐఎం మద్దతు తీసుకోవాలని నిర్ణయించింది. తెరాసకు మేయర్, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ పదవులు పంచుకునేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు అందరూ కలిపి ఐదు ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. బడంగ్ పేట కార్పొరేషన్ పై ఉత్కంఠ నెలకొంది. బడంగ్ పేటలో 32 స్థానాల్లో తెరాస 13, భాజపా 10, కాంగ్రెస్ 7, స్వతంత్రులు ఇద్దరు గెలిచారు. స్వతంత్రుల మద్దతును తెరాస కూడగట్టుకుంటోంది. సబిత ఇంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఎమ్మెల్సీలు నాయని నర్సింహారెడ్డి, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, ఎగ్గే మల్లేశం బడంగ్ పేటలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేశారు.
వాయిస్ ఓవర్: రాష్ట్రంలోని 118 పురపాలక సంఘాల్లోనూ గులాబీ జెండా ఎగరవేయాలని తెరాస భావిస్తోంది. ఇప్పటికే సుమారు 113 మున్సిపాల్టీల్లో విజయం ఖాయమైనట్లేనని తెరాస శ్రేణులు చెబుతున్నాయి. ఎంఐఎం మెజారిటీ సాధించిన బైంసా, జల్ పల్లి మినహా మిగతా పురపాలక సంఘాల్లో స్వతంత్ర అభ్యర్థులు, ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో గులాబీ జెండా ఎగర వేసేందుకు వ్యూహాలను సిద్ధం చేసింది. స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన కౌన్సిలర్ల మద్దతు కూడగట్టుకుంటున్నారు. తొంబైశాతం ఇండిపెండెంట్లు తమకు మద్దతు ప్రకటించారని తెరాస నేతలు చెబుతున్నారు. దీంతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఎక్స్ అఫీషియో ఓట్లను వ్యూహాత్మకంగా వినియోగించుకునేలా ప్రణాళికలు చేశారు. ముఖ్యంగా ఇతర పార్టీలతో సమానంగా బలం ఉన్నచోట్ల, ఒకటి, రెండు ఓట్లు అవసరం అయిన చోట్ల ప్రత్యేక దృష్టి పెట్టింది. అలాంటి పురపాలక సంఘాల్లో ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో విజయం ఖాయమని తెరాస భావిస్తోంది. రెండు రోజులుగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చించి వ్యూహాలు ఖరారు చేశారు.
వాయిస్ ఓవర్: ఖానాపూర్, నల్గొండ, హాలియా, మణికొండ, నేరేడుచెర్ల, మక్తల్, కోస్గి, చేర్యాల, దుబ్బాక, హుస్నాబాద్, సంగారెడ్డి, సదాశివపేట, తాండూరు, కొంపల్లి, నార్సింగి,పస్నూర్, ఆదిలాబాద్, చిట్యాల, సూర్యాపేట,చౌటుప్పల్, భువనగిరి, యాదగిరిగుట్ట, కామారెడ్డి, అయిజ, కల్వకుర్తి, కొల్లాపూర్, నారాయణపేట, భూత్పూర్, ధర్మపురి మున్సిపాల్టీల్లో ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి. పెద్ద అంబర్ పేట, తుర్కయాంజాల్, కోస్గి, ఆదిభట్ల, తుక్కుగూడ, కొల్లాపూర్, వడ్డేపల్లి, అయిజ వంటి మున్సిపాల్టీల్లో నాటకీయ రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల అవసరమైతే సభ్యులు గైర్హాజరై.. కోరం లేక ఎన్నిక వాయిదా పడేలా చేసే అవకాశం ఉంది. పోటా పోటీ ఉన్న చోట ఎన్నికైన సభ్యులు ఇప్పటికే రహస్య శిబిరాల్లో ఉన్నారు.
వాయిస్ ఓవర్: మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తెరాస అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. రెండు రోజులుగా కేటీఆర్ సుదీర్ఘ కసరత్తు చేశారు. ఎమ్మెల్యేలతో చర్చించి ఒక్కో పదవికి కనీసం రెండు పేర్లను స్థానిక ఎమ్మెల్యేలన నుంచి తెప్పించి.. కేసీఆర్ కు సమర్పించారు. ఉద్యమ కాలం నుంచి ఉన్న నేతలు.. రాష్ట్రావిర్భావం తర్వాత చేరిన నాయకుల మధ్య సమతూకం పాటించారు. మరోవైపు అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చేలా కూర్పు చేశారు. కొన్ని జనరల్ స్థానాల్లోనూ బీసీలు, మహిళలకు చోటు కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. నేటి కౌన్సిల్ సమావేశానికి సుమారు గంట ముందుగా అభ్యర్థి పేరును ప్రకటించాలని ఎమ్మెల్యేలకు తెరాస సూచించింది. పార్టీ ఖరారు చేసిన అభ్యర్ధులకే బీఫారాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. అవసరమైతే విప్ జారీ చేసే అధికారాలను ఎమ్మెల్యేలకు పార్టీ నాయకత్వం అప్పగించింది. అనేక సమీకరణ మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్ పర్సన్, డిప్యూటీ ఛైర్ పర్సన్ ల ఎంపికలో ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, సామాజిక సమీకరణాలు, స్ధానికంగా పార్టీకి అవసరమైన ఇతర వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.
end
Last Updated : Jan 27, 2020, 7:52 AM IST