ETV Bharat / state

NBW on BJP MP: భాజపా ఎంపీకి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్.. ఎందుకంటే? - తెలంగాణ బీజేపీ

NBW on BJP MP: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఓ కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం చర్యలు చేపట్టింది.

NBW on BJP MP
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌
author img

By

Published : Mar 24, 2022, 5:23 PM IST

NBW on BJP MP: భాజపా నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ జారీ అయింది. కేసు విచారణకు హాజరు కాలేదని పై ప్రజా ప్రతినిధుల కోర్టు వారెంట్ జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా బంజారాహిల్స్‌లో ఆయనపై కేసు నమోదైంది.

తెరాస ఫ్లెక్సీలు చింపివేశారని కేసు: జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కేబీఆర్ పార్కు వద్ద తెరాస ప్రచార ఫ్లెక్సీలను, హోర్డింగులను చింపివేశారని తెరాస నేత తాత మధు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పార్టీ నేత తాత మధు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు 2020 నవంబరులో పోలీసులు కేసు నమోదు చేశారు.

ధర్మపురి అర్వింద్‌పై బంజారాహిల్స్ పోలీసులు దాఖలు చేసిన అభియోగ పత్రంపై విచారణకు ఇవాళ హాజరు కాలేదు. ఇప్పటికే హాజరు మినహాయింపు నిరాకరించిన కోర్టు.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:

గవర్నర్​ను గుర్తించని సీఎంకు సీటులో కూర్చునే అర్హత లేదు: ఎంపీ అర్వింద్​

నిజామాబాద్​లో వేడెక్కిన రాజకీయం.. అర్వింద్​ వర్సెస్​ జీవన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.