నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామం వద్ద విద్యుదాఘాతంతో ఆరు గేదెలు మృతి చెందాయి. గ్రామంలోని గేదెల కాపలాదారుడు యథావిధిగా గేదెల మందను తీసుకొని వెళ్తున్నాడు. గ్రామ శివారు ప్రాంతంలో విద్యుత్తు లైను తెగి పడి ఉంది. తీగపై నుంచి వెళ్లిన 6 గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు పేర్కొన్నారు. ఇదే దారి గుండా రైతులు కూడా వెళ్తుంటారు. గేదెల మృతితో రైతులు అప్రమత్తమయ్యారని... పెను ప్రమాదం తప్పిందని గ్రామస్థులు తెలిపారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
ఇవీ చూడండి: లైవ్: 'మహా' బలపరీక్షకు సర్వం సిద్ధం.. కూటమి ధీమా