నిర్మల్ జిల్లా కేంద్రంలోని కళానగర్లో గల నిమిషాంబ దేవి ఆలయం, హనుమాన్ ఆలయాల్లో దొంగ పాల్పడ్డాడు. నిమిషాంబ దేవి ఆలయంలోని సుమారు 20 వేల నగదు...హనుమాన్ ఆలయంలో విగ్రహానికి ఏర్పాటు చేసిన ఇత్తడి సామాగ్రి అపహరణకు గురైనట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో గత రెండు నెలల వ్యవధిలో మూడోసారి చోరీ జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి: నేడు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్.. పన్ను తగ్గింపే లక్ష్యం!