ETV Bharat / state

REVANTH: 'అవినీతికి కేరాఫ్ తెరాస.. అక్రమాలకు పుట్టినిల్లు భాజపా' - telangana news

పెట్రోల్,డీజిల్​ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్‌లో చేపట్టిన నిరసన ర్యాలీలో టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి పాల్గొన్నారు. కేవలం రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మోదీ, కేసీఆర్​లు దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని రేవంత్​ విమర్శించారు. దేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్​దేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్​లో ఇంటి దొంగలను వదిలేది లేదని రేవంత్​ హెచ్చరించారు.

REVANTH:  'దేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్​దే'

author img

By

Published : Jul 12, 2021, 4:36 PM IST

REVANTH: 'దేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్​దే'

పెట్రోల్,డీజిల్​ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్‌లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టింది. నిరసన ర్యాలీలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్​లోని అంబేడ్కర్​ చౌక్​లో అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్​దేనని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించిన ఘనత కూడా హస్తం పార్టీదేనని వెల్లడించారు. కేవలం రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మోదీ, కేసీఆర్​లు దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని రేవంత్​ విమర్శించారు.

వేల కోట్లు దోచుకున్నాయి..

దేశంలో పేదవాడు పేదోడిగానే ఉంటున్నారన్నారు. కేవలం 50రూపాయలు ఉన్న పెట్రోల్​ను ఏడేళ్లలోనే వందకు మించేలా చేశారని ఆరోపించారు. తెరాస ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిపోయిందని రేవంత్​ విమర్శించారు. ఎన్నో పేద దేశాల్లో పెట్రోల్​ ధరలు తక్కువగానే ఉన్నాయని... భారత్​ మాత్రం ఇంతగా పెంచేశారని ఆయన మండిపడ్డారు. పెట్రోల్​, డీజిల్​ పన్నుల మీద కేంద్రం 36లక్షలు కోట్లు, రాష్ట్ర సర్కారు 19వేల కోట్లు దోచుకున్నాయని రేవంత్​ విమర్శించారు.

మహేశ్వర్​ రెడ్డిని గెలిపించాలి..

కాంగ్రెస్​లో ఇంటి దొంగలను వదిలేది లేదని.. పార్టీ​ కోసం కష్టపడిన వారిని వదులుకునేది లేదని టీపీసీసీ చీఫ్​ రేవంత్​ స్పష్టం చేశారు. కేసీఆర్ లక్కీ నంబర్ 6.. తన లక్కీ నంబర్ 9 అని రేవంత్​ వెల్లడించారు. ఆరు నంబర్‌ను తిరగేస్తే 9 అవుతుందని... కేసీఆర్​ను ఓడించి కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమాలతో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడతామని రేవంత్​ రెడ్డి అన్నారు.

చరమగీతం పాడతాం..

కాంగ్రెస్‌లో ఇంటి దొంగలను వదిలేది లేదు. కాంగ్రెస్‌ కోసం కష్టపడిన వారిని వదులుకునేది లేదు. కాంగ్రెస్‌ కార్యకర్తలను కాపాడుకుంటాం. వచ్చే ఎన్నికల్లో నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డిని గెలిపించాలి. ఉద్యమాలతో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడతాం. -రేవంత్​ రెడ్డి, టీపీసీసీ చీఫ్​

ఇదీ చదవండి: కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలో అపశ్రుతి.. ఎడ్లబండిపై నుంచి జారిపడిన దామోదర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.