ETV Bharat / state

ముగిసిన తాత్కాలిక సర్పంచ్​ ఎన్నిక

తాత్కాలిక సర్పంచ్ పదవి కోసం ముథోల్​ పంచాయతీ పరిధిలో జరిగిన క్యాంపు రాజకీయాలు, కిడ్నాప్​ కేసు వ్యవహారానికి ఎట్టకేలకు తెరపడింది. తాత్కాలిక సర్పంచ్, చెక్ పవర్ కోసం అధికారులు ఎన్నిక నిర్వహించారు. అయితే 4వ వార్డు సభ్యురాలు క్యాంపు వెళ్లిన వారి పక్షాన కాకుండా మరో వర్గం వారికి మద్దుతు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది.

author img

By

Published : Feb 22, 2021, 5:10 PM IST

Updated : Feb 22, 2021, 5:32 PM IST

Temporary sarpanch election ended in the  nirmal district
ముగిసిన తాత్కాలిక ఉపసర్పంచ్​ ఎన్నిక

నిర్మల్ జిల్లాలోని ముథోల్​ గ్రామపంచాయతీలో ఎట్టకేలకు తాత్కాలిక సర్పంచ్ ఎన్నిక జరిగింది. గ్రామంలోని 4వ వార్డు సభ్యురాలు లక్ష్మిని కొందరు కిడ్నాప్​ చేశారన్న కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ఆమెను మహారాష్ట్ర సరిహద్దులో అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అయితే క్యాంపునకు వెళ్లినట్లుగా భావిస్తున్నవర్గం వారికి కాకుండా ప్రత్యర్థి వర్గానికి ఆమె మద్దుతు ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీసులే లక్ష్మిని బెదిరించారని తాత్కాలిక సర్పంచ్ అభ్యర్థి షామిన్​ ఆరోపించారు.

ఈ విషయమై స్పందించిన భైంసా డీఎస్పీ లక్ష్మి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకే తాము ఆమెను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నీరసంగా కనిపించడంతో ఆసుపత్రికి తరలించామని స్పష్టం చేశారు. రాజకీయ వివాదాల్లోకి తమను లాగడం సరికాదని అన్నారు. ఆయితే 4వ వార్డు సభ్యురాలు లక్ష్మి మాత్రం తన ఇష్ట ప్రకారమే మద్దతు ప్రకటించానని.. తనకు ఎవరిపై కోపం లేదని పేర్కొంది.

ఇదీ చదవండి: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో వృద్ధురాలి హత్య

Last Updated : Feb 22, 2021, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.