ETV Bharat / state

భైంసా అల్లర్లపై పుకార్లు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఐజీ - Strict action if rumors spread about Bhainsa riots

ప్రస్తుతం భైంసాలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. భైంసా అల్లర్లకు సంబంధించి పుకార్లను ప్రచారం చేస్తున్న వాళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

భైంసా అల్లర్లపై పుకార్లు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఐజీ

author img

By

Published : Mar 8, 2021, 10:36 PM IST

నిర్మల్ జిల్లా భైంసా అల్లర్లకు సంబంధించి పుకార్లను ప్రచారం చేస్తున్న వాళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. భైంసాలో శాంతిభద్రతల స్థాపనే ధ్యేయంగా పోలీసులు నిబద్ధతతో పనిచేస్తున్నారని.. గొడవలు, అల్లర్లకు పాల్పడితే సహించేంది లేదని ఐజీ స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

ప్రస్తుతం భైంసాలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని.. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారని ఐజీ పేర్కొన్నారు. అల్లర్లు జరిగిన రెండు గంటల్లోనే అదుపులోకి తెచ్చినట్లు వివరించారు. 500 మందితో భైంసాలో బందోబస్తు ఏర్పాటు చేశామని... 144వ సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఐజీ వెల్లడించారు.

అల్లర్లకు కారణమైన వాళ్లను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అల్లర్లకు పాల్పడిన వాళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

ఇదీ చూడండి: బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: మహమూద్‌ అలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.