నిర్మల్ జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం ప్రజల్లో భయాందోళన రేకేత్తిస్తోంది. తాజాగా కొవిడ్ మహమ్మారిని అడ్డుకునేందుకు భైంసా మండలం మహాగామ్ గ్రామంలో మూడు రోజులు స్వచ్ఛంద లాక్ డౌన్ విధించుకున్నారు
జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో స్వచ్ఛంద లాక్డౌన్ విధించినట్లు గ్రామస్థులు తెలిపారు. చుట్టు పక్కల గ్రామాల్లోనూ కేసులు రావడంతో అప్రమత్తమై స్వీయ నిర్బంధం పాటిస్తున్నట్లు వెల్లడించారు. మూడు రోజుల పాటు లాక్డౌన్ కొనసాగుతుందని గ్రామస్థులు ప్రకటించారు.