ETV Bharat / state

నిర్మల్​లో కొండచిలువ కలకలం.. అటవీప్రాంతంలో వదిలిన అధికారులు - python in Nirmal district

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్​ కాలనీలో సోమవారం అర్ధరాత్రి ఓ ఇంట్లోకి భారీ కొండ చిలువ దూరింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

python wanders in nirmal district
నిర్మల్​లో కొండచిలువ కలకలం
author img

By

Published : Nov 3, 2020, 10:38 AM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్​ కాలనీలో అర్ధరాత్రి ఓ ఇంట్లో భారీ కొండచిలువ చేరింది. రవి అనే వ్యక్తి ఇంటి కాంపౌండ్​లోకి ఏడడుగుల పొడవు గల కొండ చిలువ ప్రవేశించగా.. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పాములు పట్టే అతణ్ని పిలిపించారు. గంటపాటు శ్రమించి కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అర్ధరాత్రి సమయంలో వెంటనే స్పందించి సహకరించిన అధికారులకు రవి కుటుంబ సభ్యులు సహకరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.