నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మాలేగాం గ్రామంలో పోలీసులు కట్టడి ముట్టడి నిర్వహించారు. ఎస్పీ శశిధర్ ఆధ్వర్యంలో 100 మంది పోలీస్ సిబ్బంది ఇంటింటా సోదాలు చేశారు.
ప్రజల్లో మమేకమై సమస్యలు తీర్చేందుకు జిల్లాలో నిర్బంధ తనిఖీలు నిర్వహించామని ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. ప్రజలు భయాందోనలకు గురవ్వాల్సిన అవసరం లేదన్నారు.
గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని ఎస్పీ కోరారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 55 ద్విచక్రవాహనాలు. 3 ఆటోలు, 2 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు.
- ఇదీ చూడండి : మిస్టరీ: చదువుకోవడానికి ఇంటిపైకెళ్లి శవమై తేలింది!