నిర్మల్ జిల్లా పెంబి గ్రామంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు జిల్లా ఎస్పీ శశిధర్ రాజు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. కరోనా వైరస్ దరిచేరకుండా మారుమూల ప్రాంతాల్లో ప్రజలు తీసుకొంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
పోలీసులు ఓ వైపు డ్యూటీ చేస్తూ మరోవైపు పేదలకు సేవ చేస్తున్నట్లు వివరించారు. అలాగే ప్రజలకు కరోనా బారి నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలనే అంశాలను వివరించారు. ప్రతిఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండి... వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఎస్పీ శశిధర్ రాజు కోరారు.