పెన్షనర్లను స్వాతంత్ర సమరయోధులతో సమానంగా గౌరవించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అన్నారు. జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభను జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ప్రారంభించారు. సమావేశంలో సీనియర్ సిటిజన్లకు శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించారు.
దేశానికి స్వాతంత్రం వచ్చాక మౌలిక సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సేవలందించారని అన్నారు. జిల్లాలో 4560 మంది పెన్షనర్లకు నెలకు రూ.12 కోట్లు ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పదవి విరమణ పొందిన ప్రతి ఒక్కరు సమాజంలో ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు పార్కులలో వృద్ధాప్య కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పెన్షనర్ల భవనానికి ప్రహరీ గోడ నిర్మించేందుకు కృషి చేస్తామని ముషర్రఫ్ ఫారూఖీ తెలిపారు.