స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని నిర్మల్ కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఫారుఖీ అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి, అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరిస్తూ వారికి ఘన నివాళులతో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని, గాంధీజీ కన్న కలలను నిజం చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి: రక్తదానం ప్రాణదానంతో సమానం: అంజనీకుమార్