కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడటానికి ఆశావర్కర్లు, వైద్యులు, పోలీసులు, అధికారులు ఎంతో కృషి చేస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. వారందరిని అభినందించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో సీజనల్ వ్యాధులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరగడానికి ఆశావర్కర్ల కృషే కారణమని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఆరోగ్యశాఖ అధికారులు, ఆశావర్కర‌్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: అమెజాన్లోనూ ఇక మద్యం హోం డెలివరీ!