BHAGEERATHA PIPE LEAK: కేవలం 24 గంటల వ్యవధిలోనే రెండు కిలోమీటర్ల పరిధిలో మిషన్ భగీరథ పైపులైన్ రెండు చోట్ల లీకైంది. మంచినీరు రోడ్డుపై వృథాగా పారింది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం సిర్గాపూర్ వద్ద నిన్న సాయంత్రం.. భగీరథ పైప్‌లైన్‌లోని ఎయిర్ వాల్వ్ లీకైంది. ఫౌంటెన్‌ను తలపించేలా పైకి ఎగజిమ్మింది.
కాసేపటికే లోలం గ్రామ సమీపంలో మరోచోట పైప్‌లైన్ లీకై మంచి నీరు నేలపాలైంది. సమాచారం అందుకున్న మిషన్ భగీరథ అధికారులు నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. నీటి వృథాను అరికట్టేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: