రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
శాస్త్రవేత్తల కృషి వల్ల కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి టీకా వచ్చిందని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా సరైన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. జిల్లా ఏరియా ఆసుపత్రిలో మొదటి టీకా డోసును ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ దేవేందర్ రెడ్డి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో, కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి, జిల్లా వైద్యాధికారి ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రెండు టీకాల్లో మనకు నచ్చింది తీసుకోవచ్చా?