నిర్మల్ జిల్లా సోన్ మండలం గాంధీనగర్ వద్ద శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సరస్వతీ కాలువకు నీటిని విడుదల చేశారు. వర్షాకాలం పంటల కోసం వారంబంధీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తామని తెలిపారు. మొత్తం 35 వేల ఎకరాలకు పైగా సాగు నీరు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఎస్సారెస్సీ సరస్వతీ కాలువ ఆయుకట్టు రైతులందరూ నీటిని వినియోగించుకోవాలని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి సూచించారు. సరస్వతీ కెనాల్ నీటితో చెరువులను కూడా నింపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ నర్మద, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, జడ్పీటీసీ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..