నిర్మల్ జిల్లా కేంద్రాన్ని అన్ని విధాలా సుందరీకరిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులను మంత్రి పరిశీలించారు. మురికి కాలువల నిర్మాణం, ఫుట్ పాత్ రెలింగ్, ఆటో స్టాండ్, నాగమాత ఆలయం వద్ద జరుగుతున్న పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూ.4 కోట్లతో రోడ్డు విస్తరణ, సుందరీకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.
అతి త్వరలోనే పనులన్నీ పూర్తయి నిర్మల్ పట్టణానికి మరింత శోభ రానుందని పేర్కొన్నారు. 150 అడుగుల జాతీయ జెండా ప్రాంతంలో మినీ పార్కును ఏర్పాటు చేస్తామని, బస్టాండ్ ప్రాంతంలో సమీకృత వ్యవసాయ మార్కెట్‌ను నిర్మించనున్నామని పేర్కొన్నారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, లైబ్రరీ జిల్లా చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము ఇతర నాయకులు, అధికారులు ఉన్నారు.
ఇదీ చదవండి: గాంధీలో కరోనా రోగులకు బలవర్ధక ఆహారం