ETV Bharat / state

రూ. 8.50కోట్లతో ఖానాపూర్​లో అర్బన్ ఫారెస్ట్​ పార్కు - మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి తాజా వార్తలు

నిర్మల్​ జిల్లా ఖానాపూర్​లో అర్బ‌న్ ఫారెస్ట్ పార్కుకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు. 225 హెక్టార్ల‌లో రూ.8.50 కోట్ల వ్య‌యంతో పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

urban forest park in khanapur
ఖానాపూర్​లో అర్బ‌న్ ఫారెస్ట్ పార్కు
author img

By

Published : Mar 3, 2021, 8:41 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌కు చేరువ‌లో ఉన్న అటవీ బ్లాకులను.. అర్బన్ పార్కులు, లంగ్ స్పేస్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప‌ట్టణానికి స‌మీపంలోని మస్కాపూర్ బీట్​లో హ‌రిత‌వ‌నం(అర్బ‌న్ ఫారెస్ట్​) పార్కు ఏర్పాటుకు మంత్రి భూమి పూజ‌ చేశారు. 225 హెక్టార్ల‌లో రూ.8.50 కోట్ల వ్య‌యంతో పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఆహ్లాదాన్ని కలిగించేలా..

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని మావ‌ల‌, నిర్మ‌ల్, ఆసిఫాబాద్ ప‌ట్ట‌ణాల‌కు స‌మీపంలో ఇప్ప‌టికే అర్బన్​ ఫారెస్ట్​ పార్కులు ప్రారంభమయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పార్కుల్లో వారాంతాలు, సెలవు రోజుల్లో ప్రజలు ప్రశాంతంగా గడిపేందుకు ఆసక్తి చూపుతున్నార‌ని వెల్లడించారు. ఆట‌విడుపు కోసం పిల్లలకు ఆటస్థలం, పెద్దలకు వాకింగ్, సైక్లింగ్, ప‌గోడాలు, క‌నోఫి వాక్, లోట‌స్ పాండ్, వాచ్ ట‌వ‌ర్ చుట్టూ ఫెన్సింగ్, బంధుమిత్రులతో వనభోజనాలు చేసుకునేలా.. ఈ అటవీ ఉద్యానవనాన్ని తీర్చిదిద్ద‌నున్నామని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ముషారఫ్​ ఫారూఖీ, ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయ‌క్, జ‌డ్పీ ఛైర్​ప‌ర్స‌న్ కొరిపెల్లి విజ‌య‌ల‌క్ష్మి‌, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలకు ఎవరు బాధ్యులు: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.