Indrakaran reddy in RGUKT: బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులతో దేవాదాయశాఖ మంత్రి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమావేశమయ్యారు. విద్యార్థుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీకి వెళ్లిన మంత్రి విద్యార్థులతో భేటీ అయ్యారు. రెండో గేటు నుంచి ఆర్జీయూకేటీలోకి వెళ్లిన ఇంద్రకరణ్‌రెడ్డి వారి సమస్యలపై ఆరా తీశారు. మంత్రితో పాటు ఉన్నత విద్యామండలి వైస్‌ఛైర్మన్ విద్యార్థులతో సమావేశమయ్యారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఒక తల్లిగా బాధేస్తోంది: సబిత
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ రాశారు. విద్యార్థులు ఆందోళన విరమించాలని ఆమె లేఖలో విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని లేఖలో పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేసే ఉద్దేశం తమకు లేదని సబితాఇంద్రారెడ్డి లేఖలో వివరించారు. ఆందోళనలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీ రాజకీయాలకు వేదిక కావద్దని ఆమె సూచించారు. విద్యార్థుల ఆందోళనలను చూస్తే మంత్రిగా, ఒక తల్లిగా చాలా బాధేస్తోందని సబిత విచారం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:
Basara RGUKT update: బాసరలో నాలుగోరోజు విద్యార్థుల ఆందోళన..
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. చేతిని కొరికి తప్పించుకున్న చిన్నారి