కరోనా ప్రభావం వల్ల ఈ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కూరగాయల దుకాణాలన్నీ కిక్కిరిసిపోయాయి. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వేకువ జామున నుంచే ప్రజలు మార్కెట్ బాట పట్టారు. ఫలితంగా దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.
పెద్దఎత్తున కొనుగోలుదారులు రావడం వల్ల వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. నిన్న, మొన్నటి వరకు సాదాసీదాగా ఉన్న రేట్లు.. నేడు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెరిగిన రేట్లతో సరుకులు కొనేందుకు సామాన్య ప్రజలు జంకుతున్నారు.
ఇవీ చూడండి: 27కు చేరిన కరోనా కేసులు.. కట్టడికి కఠిన నిర్ణయాలు