ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ రూరల్ మండలం కౌట్ల (కె) గ్రామంలోని ఇటుక బట్టీల్లో అకస్మికంగా తనిఖీలు చేశారు. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చిన 14 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. పిల్లలతో పని చేయిస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరించారు.
బాలలతో వెట్టిచాకిరి చేయించకుండా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని బాలల పరిరక్షణ అధికారి సగ్గం రాజు అన్నారు. కార్మికులు పని చేసే ప్రాంతంలో పిల్లలకై వర్క్ సైడ్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు జిల్లా విద్యాధికారికి నివేదించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ సిబ్బంది శైలజ, కవిత, పోలీసు సిబ్బంది చిన్నయ్య, సురేశ్, నరేశ్, వజ్రమ్మ, ఇతరులు పాల్గొన్నారు.