ETV Bharat / state

ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణం: జూలకంటి - tsrtc strike latest news

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. నిర్మల్​లో ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన ఆయన... ప్రభుత్వ విధానం పట్ల మండిపడ్డారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి.. వారి డిమాండ్లను పరిష్కరించాలన్నారు.

ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణం: జూలకంటి
author img

By

Published : Oct 25, 2019, 8:54 PM IST

ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లడానికి ప్రభుత్వమే కారణమని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించకపోతే తన పదవికి సెల్ఫ్​ డిస్మిస్​ చేసుకోవాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు జీతాలు పెంచేందుకు డబ్బులున్నాయి కానీ... కార్మికులకు జీతాలు పెంచేందుకు డబ్బులు లేవనడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వం నష్టాల్లో ఉన్నప్పటికీ విద్య, వైద్యం, విద్యుత్, రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. రాజకీయ పార్టీలు వెనక ఉండి రెచ్చగొడుతున్నారని సీఎం అనడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

Intro:TG_ADB_31_24_RTC SAMME_AVB_TS10033
ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణం: మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి

ఆర్టీసీ సంస్థ నష్టాల్లోకి వెళ్లడానికి ప్రభుత్వమే కారణమని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు శుక్రవారం ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించకపోతే తన పదవికి సెల్‌్ఫడిస్మిస్ చేసుకోవాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు జీతాలు పెంచేందుకు డబ్బులున్నాయి కాని కార్మికులకు జీతాలు పెంచేందుకు డబ్బులు లేవనడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వం నష్టాల్లో ఉన్నప్పటికీ విద్య, వైద్యం, విద్యుత్, రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. రాజకీయ పార్టీలు వెనక ఉండి రెచ్చగొడుతున్నాయనడం సీఎం అనడం సరికాదన్నారు. సీఎం స్థాయిలో ఉండి ఇష్టారీతిన మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.Body:నిర్మల్ జిల్లా Conclusion:శ్రీనివాస్ 9390555843
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.