ETV Bharat / state

బాసర ఆర్జీయూకేటీకి బెస్ట్​ ఇన్నోవేషన్​ అవార్డు - ఇన్నోవేషన్​ అవార్డు

వరల్డ్​ ఎడ్యుకేషన్​ సమ్మిట్​-2020లో నిర్మల్​ జిల్లా బాసర ఆర్జీయూకేటి బెస్ట్​ ఇన్నోవేషన్​ అవార్డును కైవసం చేసుకుంది. హైదరాబాద్​లోని మారియట్​ హోటల్లో నిర్వహించిన సదస్సులో ఈ అవార్డును ఉపకులపతి అశోక్​ అందుకున్నారు.

Innovation Award for Basar RGUKT college in nirmal
బాసర ఆర్జీయూకేటీకి బెస్ట్​ ఇన్నోవేషన్​ అవార్డు
author img

By

Published : Feb 23, 2020, 2:28 PM IST

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటికి వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్-2020లో బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు దక్కింది. హైదరాబాద్​లోని మారియట్ హోటల్లో నిర్వహించిన సదస్సులో బాసర విద్యాసంస్థకు ఈ అరుదైన గౌరవం లభించింది. ఈ విభాగంలో మెరుగైన విద్య ప్రమాణాలు ఉన్న 95 కళాశాలలు పాల్గొనగా వాటిలో బాసర ఆర్జీయూకేటీకి ఈ అవార్డు అందింది.

రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి శుచి శర్మ, అన్నపూర్ణ కాలేజ్ మీడియా అండ్ ఫిల్మ్ డైరెక్టర్ అక్కినేని అమల చేతుల మీదుగా ఉపకులపతి అశోక్ అవార్డును అందుకున్నారు. ఈ సదస్సులో బాసర ఆర్జీయూకేటీ నుంచి వ్యవసాయ రంగం, మహిళల భద్రత, రోడ్ల భద్రత లాంటి పలు అంశాల మీద విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ సిబ్బంది, విద్యార్థులను ఉపకులపతి అభినందించారు. సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్​తో పాటు పలువురు ఐఏఎస్​ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బాసర ఆర్జీయూకేటీకి బెస్ట్​ ఇన్నోవేషన్​ అవార్డు

ఇదీ చూడండి: అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.