హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్మల్లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్రను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆలయం నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎక్కడైతే హిందూ ధర్మాన్ని కాపాడగలుగుతామో అక్కడే ప్రశాంతత ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలు మతాల వారీగా విడదీసి అమలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇవీ చూడండి: ఆదిలాబాద్లో దళితసంఘాల ఆందోళన