కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని న్యూవెల్మల్, బొప్పారం గ్రామాల్లో హనుమాన్ జాతర వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి... వివిధ రకాల పూలు, తమలపాకులతో అలంకరించారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. వాయుపుత్రుడిని దర్శించుకునేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఉట్టికొట్టేందుకు గ్రామంలోని యువకులు పోటీపడ్డారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ జాతరను ఏటా కార్తిక పౌర్ణమి రోజున నిర్వహిస్తున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు వెంకయ్య, హరిత శ్రీనివాస్ రెడ్డి, అంకం గంగామణి శ్రీనివాస్, ఎంపీటీసీ నాగయ్య, ఉప సర్పంచ్ గడ్డం స్వామి, మాజీ ఎంపీపీ సరిగెల గంగన్న, మాజీ సర్పంచ్ రాంరెడ్డి, భూమారెడ్డి, వీడీసీ సభ్యులు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మంచిర్యాల జిల్లాలో వైభవంగా కార్తిక పౌర్ణమి వేడుకలు