పారదర్శకమైన పాలనను అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే దేశం అభివృద్ధి చెందుతోందని నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల భాజపా అధ్యక్షులు కరిపె విలాస్ అన్నారు. కేంద్రంలో భాజపా వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మండలంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. జామ్, కౌట్ల (బి), ఆలూర్, రాంసింగ్ తండా, తాండ్ర గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మాస్కులు, పండ్లు పంపిణీ చేశారు. కేంద్రం ఉచితంగా పంపిణీ చేస్తున్న కరోనా టీకాపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని, ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దని విలాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తేజు నాయక్, చాణక్య, లక్ష్మణ్, తిరుమల చారి, మచ్చెందర్, రవి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Eatala: ఒక్క ఎకరం ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తా: ఈటల సతీమణి