ఒక్క పైసా కూడా రాలేదు
లక్ష్మణ్ అనే రైతుకు వారసత్వంగా 3.15 ఎకరాల భూమి వచ్చింది. పెట్టుబడి సాయం ఒక్క పైసా కూడా రాలేదని చెబుతున్నాడు. అధికారుల చుట్టు తిరిగినా కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్నకారు రైతులను ఇలా చేయడం సరైంది కాదన్నాడు.
ఒకే సర్వే నంబర్ అయినా
పుస్పూర్ గ్రామానికి చెందిన వీరేశ్కు 6.02 ఎకరాల భూమి ఉంది. ఇదే సర్వే నంబరులో ఉన్న అమ్మకు, అన్నకు రైతు బంధు డబ్బులు వచ్చాయని తనకేమో రాలేదని వాపోయాడు. అధికారుల వద్దకు ఎన్నిసార్లు వెళ్లినా పట్టించుకోలేదన్నాడు. చాలా మంది అన్నదాతల పరిస్థితి ఇదే విధంగా ఉంది.
త్వరలో మిగిలిన వారికి
లోకేశ్వరం తహసీల్దార్ శ్రీదేవిని వివరణ కోరగా తను లోకేశ్వరానికి ఎన్నికల విధుల కోసం బదిలీపై వచ్చానని తెలిపారు. ఈ ఎన్నికల హడావుడిలో ఉన్నామని ఇప్పటికే 700 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. మిగిలిన వారికి త్వరలో అందజేస్తామని వెల్లడించారు.
అధికారులు వీలైనంత త్వరగా తమకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి:'ఓటు స్లిప్పుల లెక్కపై మా పద్ధతే ఉత్తమం'