నిర్మల్ జిల్లా భైంసాలో గత నెలలో జరిగిన అల్లరి మూకల దాడులపై హైకోర్టు న్యాయమూర్తితో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని తెలంగాణ న్యాయవాది పరిషత్ డిమాండ్ చేసింది. భైంసా అల్లర్లు... ఆపై చోటు చేసుకున్న పరిణామాలపై జనవరి 27న తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఘటనా స్థలాన్ని నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించింది.
ఘర్షణలో ఓ వర్గం చేతిలో ధ్వంసమైన నివాస సముదాయాలను సందర్శించామన్నారు. అల్లర్లకు పాల్పడ్డ వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. జమీన్ జీహాద్ కార్యకలాపాలపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరిపించాలన్నారు. ఆస్తి నష్టపోయిన వారికి తక్షణమే నష్ట పరిహారం అందించాలని కోరారు.
ఇవీ చూడండి : నేరకథా చిత్రమ్: చేపల వ్యాపారి హత్య వెనుక విస్తుపోయే ప్రణాళిక!