పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని... నిర్మల్ జిల్లా ముధోల్లో ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. ఎండలో మట్టి పని చేస్తున్నప్పటికీ వారం రోజులుగా పని చేస్తే కేవలం రూ.400 మాత్రమే ఇచ్చారని అన్నారు. అడిగితే ఏదో ఒక సాకు చూపుతున్నారని కొలతలకు వచ్చిన అధికారులను నిలదీశారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పని చేస్తే... ప్రభుత్వం ఇంత తక్కువ ఇవ్వడం పద్ధతి కాదని కూలీలు పేర్కొన్నారు. అధికారులు మాత్రం వారం వరకు ఎవరూ పని చేసే చోటుకు రావడం లేదని ఆరోపించారు. వ్యవసాయ పనులకు వెళ్తే రూ.250 కూలీ వస్తాయని అన్నారు.
ఇదీ చదవండి: 'టీకాలు ఉచితంగానే అందిస్తాం'