ETV Bharat / state

కరోనా వ్యాధి గ్రస్థులు, అన్నార్తులకు అన్నదానం - nirmal corona patients

కరోనా వ్యాధిగ్రస్తులు తమ రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు పండ్లు, గుడ్లు, డ్రై ప్రూట్స్​ను నిర్మల్ జిల్లా కేంద్రంలో తెరాస పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు పంపిణీ చేశారు.

nirmal district news today
కరోనా వ్యాధి గ్రస్థులు, అన్నార్తులకు అన్నదానం
author img

By

Published : May 26, 2021, 5:04 PM IST

కరోనా వల్ల విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న అన్నార్తుల ఆకలిని తెరాస పార్టీ పశ్చిమ జిల్లా మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు తీరుస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కరోనా బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి నిత్యం పండ్లు, గుడ్లు, డ్రై ప్రూట్స్​ను ఆయన అందజేస్తున్నారు.

లాక్​డౌన్ సమయంలో నిరాశ్రయులు, యాచకులు, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద రోగుల బంధువులకు బుధవారం ఆయన ఆహార పదార్థాలు అందజేశారు. కరోనా సమయంలో ప్రజల ఆకలిని కొంతైనా తీర్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని కూచాడి శ్రీహరి రావు అన్నారు.

కరోనా మహమ్మారి నుంచి అందరూ త్వరగా కోలుకోవాలని ఆయన తెలిపారు. లాక్​డౌన్ పూర్తయ్యే వరకు ప్రతిరోజు ఆహార పదార్థాలు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, తెరాస నాయకులు పూదరి అరవింద్, గాజుల రవి కుమార్, భూరాజ్, గడ్డింటి ప్రశాంత్, సంజీత్ రెడ్డి, గణేశ్​, అజహర్, కోనేటి ఆనంద్, చైతన్య, కృష్ణ సాయి, చంద్ర శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఖాళీ ప్లాట్లలో పంటల సాగు.. నగరసేద్యంలో ఆదర్శం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.