నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ ప్రగతి కార్యక్రమం రసాభాసగా మారింది. తెరాస నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా అధికారులు మారారని, ప్రతిపక్ష కౌన్సిలర్లను నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నాలుగో రోజు పట్టణ ప్రగతిలో భాగంగా కలెక్టర్ ముషారఫ్ అలి ఫారూఖీ, ఎమ్మెల్యే రేఖా నాయ్ పట్టణంలో పర్యటించారు. కలెక్టర్ పర్యటన గురించి తమకు సమాచారం ఇవ్వకుండా.. తెరాస నాయకులు ఫోటోలకు పోజులిచ్చి అధికారులను పంపించారని, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆరోపించారు.
ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా..
అధికారుల తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. నచ్చజెప్పేందుకు వచ్చిన ఎంపీడీవోపై దుర్భాషలాడారు. పోలీసులు కలుగజేసుకోని సముదాయించేందుకు యత్నించినా ఆందోళన విరమించలేదు.
ఇవీ చూడండి: జిల్లా కేంద్రంలో పర్యటించిన నిర్మల్ కలెక్టర్