పెద్దపల్లి జిల్లాలో వామన్‌రావ్ దంపతుల హత్యను ఖండిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. నిర్మల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి ఫిబ్రవరి17ను బ్లాక్‌డే గా పరిగణించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.
దారుణ హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు తమ వృత్తి ధర్మం నిర్వహిస్తారని.. ఎవరిపైనా వ్యక్తిగత కక్షలు ఉండవని న్యాయవాది రమణ గౌడ్ తెలిపారు. తమకు రక్షణ కల్పించేలా చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చూడండి: న్యాయవాదుల ఆందోళన.. విధుల బహిష్కరణ