ETV Bharat / state

నేటి నుంచి గులాబీ దళపతి తుది విడత ప్రచారం - కేసీఆర్​ బహిరంగ సభలు

సారు.. కారు.. పదహారు.. నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎన్నికల ప్రచారంలో సమరభేరి మోగించారు. రెండు దశల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఇప్పుడు తుది విడత ప్రచారాన్ని నేటి నుంచి ప్రారంభించనున్నారు. గులాబీ దళపతి చివరి దశ ప్రచారానికి తెరాస నేతలు భారీగా జనాన్ని  సమీకరించేందుకు కసరత్తు చేస్తున్నారు.

తెరాస ప్రచారం
author img

By

Published : Apr 7, 2019, 5:08 AM IST

Updated : Apr 7, 2019, 7:59 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ లోక్​సభ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. ఇవాళ నిర్మల్​లో, సోమవారం వికారాబాద్​ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఎల్బీ స్టేడియంలో సభకు హాజరుకానందున మరోసారి అక్కడ బహిరంగ సభ నిర్వహించాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. గడువు లేదని భావిస్తే వికారాబాద్​ పర్యటనతోనే ప్రచారం ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తుది విడత సభలకు భారీగా జన సమీకరణ చేసేందుకు తెరాస నేతలు కసరత్తు చేస్తున్నారు.

16 స్థానాల్లో గెలుపే లక్ష్యం

తెలంగాణలో 16 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తెరాస అధినేత ప్రచారం సాగించారు. గత నెల 17న కరీంనగర్​లో బహిరంగ సభతో సమరభేరి మోగించారు. నిజామాబాద్​ సభ తర్వాత కాస్త విరామం ఇచ్చి 31 నుంచి మలి విడత ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఏప్రిల్​ 4 వరకు మొత్తం పది నియోజకవర్గాల ప్రచారంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్​, మల్కాజిగిరి, చేవెళ్ల, హైదరాబాద్​ నియోజకవర్గాలకు కలిసి సంయుక్తంగా గత నెల 31న ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించినప్పటికీ జనసమీకరణలో లోపం కారణంగా సీఎం ఆ సభకు హాజరు కాలేదు. ఈనెల 8న సాయంత్రం వికారాబాద్​ సభతో కేసీఆర్​ ప్రచారం ముగిసే అవకాశం ఉంది.

ఇవాళ్టి నుంచి కేసీఆర్​ తుదివిడత ప్రచారం

ఇదీ చదవండి : సోషల్​ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు: కవిత

Intro:పెద్దపెల్లి జిల్లా కమాన్పూర్ మండలం కేంద్రంలోని శ్రీ ఆది వరాహ స్వామి దేవాలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేకంగా ఉగాది వేడుకలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు దేవాలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేశారు . శ్రీ ఆది వరాహ స్వామి వారిని వివిధ రకాల వర్ణమై పుష్పాలతో అలంకరించి దర్శనానికి భాగ్యం కల్పించారు అనంతరం స్వామివారికి ఎదురుగా ఉన్న మండపంలో లో శ్రీ అలీవేలు మంగ శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టించి ధూప దీప నైవేద్యాలు నివేదించి భక్తులకు కు పంచాంగం శ్రవణాన్ని నిర్వహించారు

Body:ఎన్.శివప్రసాద్ మంథని

Conclusion:9440728281
Last Updated : Apr 7, 2019, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.