chiruta fear in nirmal: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని మైలాపూర్-బాసర ఆర్జీయుకేటీ మధ్య ఉన్న వ్యవసాయ భూముల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు ఓ స్థానికుడు తెలిపారు. బిద్రేపల్లి గ్రామం నుంచి వస్తుండగా మొలాపూర్ గ్రామ శివారులో చిరుతను ఒక్కసారిగా చూసి భయబ్రాంతులకు గురైనట్లు ఆ స్థానికుడు పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుత సంచరించిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు.
అక్కడ కనిపించిన అడుగుల గుర్తులను ఉన్నతాధికారులకు పంపించగా అవి చిరుతవి కాదు అని తోడేలువని నిర్దరించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, తోడేలు సంచరిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవీ చదవండి: