కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని... నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు క్లోరోఫిల్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.
కరోనా బారి నుంచి ప్రజలను రక్షించేందుకు ఈ ద్రావణాన్ని పిచికారి చేయించినట్లు ఆయన తెలిపారు. రోజురోజుకు మహమ్మారి విజృంభిస్తోందని... వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: నిలకడగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం