కరోనా వ్యాప్తి చాలా వరకు ముఖం ద్వారానే వ్యాపిస్తుందని ఇదివరకే స్పష్టమైందని నిర్మల్ జిల్లా అధికారులు తెలిపారు. ఈ కారణంగానే ముఖానికి మాస్కుతో కప్పి ఉంచాలని తద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు తగ్గుతాయని సూచిస్తూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కొంతమంది ధరిస్తున్నా.. మరికొందరు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా బహిరంగ ప్రదేశాలకు వస్తున్నారు. దీనివల్ల పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండటం వల్ల నివారణపై అధికారులు దృష్టి సారించారు.
ఇకపై మాస్కులు లేకుండా రహదారిపైకి వస్తే జరిమానా చెల్లించక తప్పదని తెలిపారు. ఇందుకోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు మొదలు పెట్టారు. ఈ మేరకు తొలిరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని తదనుగుణంగా ఒక్కొక్కరికి కనీసం వెయ్యి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. రేపటి నుంచి మాస్కులు ధరించని వారు.. ఎంతటివారినైనా వదిలేది లేదని హెచ్చరిస్తున్నారు.
ఇవీ చూడండి: బతుకమ్మ చీరల ఉత్పత్తి షురూ..మంత్రి కేటీఆర్ హర్షం..