కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఉద్యమిస్తున్న నేపథ్యంలో ఈ రోజు చేపట్టిన భారత్ బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో నిర్మల్ జిల్లాలో బస్సులు రోడ్డెక్కలేదు. నిర్మల్, భైంసాలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
నిర్మల్ డిపో పరిధిలోని 140, భైంసా డిపో పరిధిలోని 80 బస్సులు నిలిచిపోవడంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ముందస్తు చర్యగా బస్సు డిపోల ఎదుట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: 'నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నదే సర్కారు లక్ష్యం'