నిర్మల్ జిల్లా కేంద్రంలో పౌర సరఫరాల శాఖ, పోలీసులు కలిసి ప్రజాపంపిణీ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై దాడులు నిర్వహించారు. పట్టణంలోని గాజుల్పేటలోని ఓ ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 20 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించారు. గత నెలరోజుల వ్యవధిలో 15 కేసులు నమోదు చేశారు. 325 క్వింటాళ్ల బియ్యం, 600 లీటర్ల కిరోసిన్ స్వాధీనం చేసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్కుమార్ తెలిపారు. అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని కొన్నా, విక్రయించినా చట్టవ్యతిరేకమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇలాంటి సమాచారం ఎవరికైనా తెలిస్తే 73307 74444 నెంబరుకు వాట్సప్ చేసి సమాచారాన్ని అందజేయాలన్నారు.
ఇదీ చూడండి : నిర్మల్ జిల్లాలో నేలకొరిగిన 150 ఏళ్ల మహా వృక్షం