ETV Bharat / state

'కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడండి' - Bamni villagers protest to protect occupied lands in nirmal district

నిర్మల్ కలెక్టరేట్ వద్ద లోకేశ్వరం మండలం బామ్ని గ్రామస్థులు ఆందోళన చేశారు. తమ గ్రామంలో కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడాలంటూ ఆర్డీవో రమేష్ రాఠోడ్​కు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

Bamni villagers protest to protect occupied lands in nirmal district lokeshwaram mandal
'కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడండి'
author img

By

Published : Feb 23, 2021, 1:56 PM IST

నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట లోకేశ్వరం మండలం బామ్ని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి చెందిన ఓ రేషన్ డీలరు ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడుతూ.. బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. గత మూడు సంవత్సరాల నుంచి ఈ విషయమై తహసీల్దార్​కు ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కలెక్టర్ కార్యాలయంలో.. ఆర్డీవో రమేష్ రాఠోడ్​కు తమ సమస్య వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆర్డీవో వెంటనే సంబంధిత అధికారిని ఫోన్​లో సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసన విరమించారు.

ఇదీ చదవండి:భారత మీడియాపైనా చైనా గుర్రు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.