ETV Bharat / state

'ఊరురా అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి'

నిర్మల్ జిల్లాలోని ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమశాఖ ద్వారా ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని పేర్కొన్నారు.

author img

By

Published : Jul 6, 2020, 8:07 PM IST

Anganwadi center should be set up in every village in Nirmal district
ఊరురా అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి

నిర్మల్​ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ పథకాల అమలు, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమశాఖ ద్వారా ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.

పోషక ఆహారం లోపంతో ఉన్న పిల్లలకు, గర్భిణీలకు అంగన్వాడీ కేంద్రాలలో ప్రతిరోజు పౌష్టికాహారం అందించాలని పేర్కొన్నారు. కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు గర్భిణీలకు కేసీఆర్ కిట్​పై అవగాహన కల్పించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి రాజగోపాల్, సీడీపీఓలు తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.