ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా పాలనాధికారి ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కొవిడ్, ఐసీయూ, మాతా శిశు సంరక్షణ కేంద్రంలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ఏరియా ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని తెలిపారు. వైద్యులు,సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. సిబ్బంది హాజరు శాతం, సీసీ కెమెరాల పనితీరును ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్ రెడ్డి, మేనేజర్ నదీమ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.