నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామ పంచాయతీ పరిధిలో పల్లె ప్రకృతి వనం పార్కును ఏర్పాటు చేయడానికి అధికారులు ఉపక్రమించారు. పార్కు నిర్మాణానికి అధికారులు, గ్రామ పంచాయతీ.. నిర్ణయించిన స్థలంలో ఇది వరకే శ్మశాన వాటిక ఉండటం వల్ల అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలని గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
తాము శ్మశానంలో వద్దని చెప్పినా.. అధికారులు పనులు చేపట్టడం వల్ల ఆగ్రహం చెందిన స్థానికులు ధర్నాకు దిగారు. 167వ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకోతో రహదారికి ఇరువైపుల కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని ధర్నా విరమింపజేశారు.
- ఇదీ చదవండి జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం