ETV Bharat / state

వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డు.. నిలిచిపోయిన రాకపోకలు

నారాయణపేట జిల్లాలో గురువారం కురిసిన వర్షానికి ఊట్కూర్​ మండలం ఓబులాపురం గ్రామంలోని నక్కలవాగు నీటి ప్రవాహం పెరిగింది. వాగు పొంగుకు.. రోడ్డు కొట్టుకుపోయి.. ఓబులాపురం​ గ్రామానికి వచ్చే రోడ్డు పూర్తిగా చెడిపోవడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి.

Road Damage in Narayanpet District Obulapur village
వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డు.. నిలిచిపోయిన రాకపోకలు
author img

By

Published : Jul 3, 2020, 10:27 PM IST

నారాయణపేట జిల్లా ఊట్కూర్​ మండలం ఓబులాపురం గ్రామంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి గ్రామంలోని నక్కలవాగు నిండి.. పొంగింది. వాగు నీటి ప్రవాహం ఎక్కువై మండల కేంద్రానికి అనుబంధమై ఉన్న రోడ్డు కోతకు గురయింది. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

వాగు పారేందుకు ఏర్పాటు చేసిన బ్రిడ్జి పునర్నిర్మించాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గత కొద్దిరోజులుగా గ్రామస్తులు కోరినా.. అధికారులు పట్టించుకోలేదు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టరు అవినీతి వల్లనే రోడ్డు చెడిపోవడం వల్ల మండల కేంద్రానికి చేరుకోవాలంటే 25 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: గుడ్​న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కోవాగ్జిన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.