రైతుల కోసమే నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చినట్లు మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ రైతులంతా ట్రక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు హాజరయ్యారు. మంత్రి నిరంజన్ గౌడ్ స్వయంగా ట్రాక్టర్ నడిపి ర్యాలీని ప్రారంభించారు.
భూ తగాదాల శాశ్వత పరిష్కారానికి తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం రైతులకు ఎంతో ఉపయోగకరమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ చట్టం పూర్తిస్థాయిలో అమలైతే.. ప్రజల ఆస్తుల రక్షణ కలుగుతుందన్నారు. ఈ చట్టం రాబోయే రోజుల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
గతంలో పాస్‌పుస్తకాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రైతులు తిరిగేవారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ రూపకల్పనతో అలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. దళారుల అవసరం లేకుండా రైతులే ఎక్కడైనా తమ భూ పత్రాలు తీసుకోవచ్చని మంత్రి తెలిపారు.
ఇవీచూడండి: 'కర్షకుల కన్నీళ్లు తుడిచేందుకే.. నూతన రెవెన్యూ చట్టం'