నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల పరిధిలో ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రాకుండా పోలీసులు కట్టుదిట్ట చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వత్తుగండ్ల గ్రామం నుంచి పేరపళ్లకు కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తోన్న సుమారు 600 కిలోల నల్లబెల్లాన్ని జిల్లా ఆబ్కారీ అధికారులు పట్టుకున్నారు.
ఈ ఘటనలో ఏడుగురిని అదుపులోకి తీసున్నామని ఇంఛార్జి ఎక్సైజ్ శాఖ అధికారి రమణయ్య తెలిపారు. వీరందరిని చట్టప్రకారం మెజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేస్తామని వెల్లడించారు.